ప్రముఖ కథా రచయిత నైజాం రౌథర్ బుధవారం ఉదయం మరణించారు. ఆయన వయస్సు కేవలం 49 సంవత్సరాలు. కేరళలోని పత్తనం తిట్ట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలియగానే మాలీవుడ్ చిత్ర సీమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన వర్క్ చేసిన సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవుతుంది అనగా.. అంతలో ఊహించని విధంగా గుండెపోటుతో మరణించారు.
ఆయనకు భార్య సఫీనా, ఇద్దరు పిల్లలు రసూల్, ఆజ్మీ ఉన్నారు. సినిమా రంగంలోకి రాక ముందు నిజాం జర్నలిస్టుగా కొంత కాలం పనిచేశాడు. అప్పట్లో కూడా మంచి ఆర్టికల్స్ అందించి మంచి జర్నలిస్టుగా పేరు పొందాడు. జచరియూయుడే గర్బినికల్, బొంబాయి మిట్టై, రేడియో వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించాడు. జచరియూయుడే గర్బినికల్ 44వ కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ కథ, ఉత్తమ దర్శకుడి విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది.

ప్రస్తుతం ఆయన మలయాళ చిత్రం ఒరు సర్కార్ ఉల్పనం అనే చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. తొలుత భారత్ సర్కార్ ఉల్పనం అని ఉండగా.. భారత్ అనే పేరుపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాని పేరు మార్చి తర్వలో విడుదల చేయబోతున్నారు. ఇంతలో ఆయన మరణించారు. కాగా, నైజాం మరణ వార్త గురించి తెలిసి.. పలువురు సినీ ప్రముఖులు అతడి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.