అబ్బాయిలు, అమ్మాయిలు OYO రూమ్ లో దొరికితే ఏం చెయ్యాలో తెలుసుకోండి.

సాధారణంగా ఓయో రూమ్స్ గాని, లేదంటే ఏదైనా హోటల్ రూమ్స్ కానీ, క్లబ్ కు కానీ వెళ్ళినప్పుడు వెళ్లిన ఇద్దరి ఆధార్ కార్డులు తీసుకొని రూమ్స్ ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కువ అమౌంట్ చెల్లిస్తే రూమ్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది వచ్చిన వ్యక్తులకు సంబంధించి ఐడెంటి కార్డు ఇస్తేనే రూమ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇద్దరి ఆధార్ కార్డులపై భార్యాభర్తలు అయితే ఇంటిపేరు ఒకే విధంగా ఉండాలి.

అలాగే వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు చెక్ చేసి సరైందా కాదా అని చూస్తారు. అలా సరి చేసుకున్న తర్వాతే రూమ్స్ ఇచ్చే రూల్స్ ఉన్నాయి. కానీ కొంతమంది రూమ్స్ కు వచ్చి ఇద్దరం మేజర్లమని చెప్పి మాకు కలిసి ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి మేం సహజీవనం చేస్తున్నామని రూమ్స్ తీసుకుంటారు. ఈ తరుణంలో పోలీసులకు పట్టుబడితే మీరు చెప్పిన విషయాలను వారు అస్సలు నమ్మరు.

ఈ తరుణంలో అమ్మాయిని పీఠా యాక్ట్ కింద బుక్ చేసి, ఒకవేళ అమ్మాయి పర్సులో డబ్బులు ఉంటే ఈ డబ్బులు ఆయన ఇచ్చారు అని నువ్వు డబ్బుకు శరీరాన్ని అమ్ముకుంటున్నావని ఒక కేసును బుక్ చేస్తారు. పీట యాక్ట్ కింద అరెస్ట్ అయితే అమ్మాయిని మహిళ సంరక్షణ కేంద్రానికి పంపిస్తారు. ఇక అబ్బాయి మాత్రం తప్పనిసరిగా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఓయో రూమ్స్ కీ వెళ్లేటప్పుడు సరైన ఆధారాలు తీసుకొని వెళ్లాలని కొంతమంది అడ్వకేట్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *