వైఎస్ షర్మిల కుటుంబసభ్యులతో కలిసి బుధవారం కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను తన సోదరుడు జగన్‌కు షర్మిల అందజేయనున్నారు. ఈ భేటీ అనంతరం షర్మిల విజయవాడ నుంచి బయలుదేరి దిల్లీ వెళ్లనున్నారు.
నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లిన షర్మిల… తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద కుమారుడి వివాహ మొదటి పత్రిక పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న వైఎస్ షర్మిళకు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమె తాడిపల్లిలో తన సోదరుడు సీఎం జగన్‌ను కలిసి.. కుమారుడి పెళ్ళి శుభలేకను అందించనున్నారు.
కాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా.. షర్మిల టాపిక్కే… ఏపీలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ షర్మిల ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల చేరిక వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. అయితే… షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఆమెకు హైకమాండ్ ఎలాంటి పదవి ఇస్తుందన్నది కూడా ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.