పబ్లిక్‌లో విజయ్ దేవరకొండ బూతులు, జరగండ్రా నీ*** అంటూ రచ్చ, వైరల్ వీడియో.

ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ కొంచెం డిఫరెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్ర చేశాడు. ఈ పాత్రను రిప్రెజెంట్చేసేలా … బైక్ పై ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యాడు. అయితే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ – మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

గీతాగోవిందం మూవీ దర్శకుడు పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మూవీ యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో భాగంగా విజయ్ దేవరకొడ మాట్లాడిన ఓ మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. పబ్లిక్‌లో ఏంటా మాటలు అంటూ విజయ్‌పై ఫైర్ అవుతున్నారు.

అయితే మరి విజయ్ అంతలా ఏం మాట్లాడాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా విజయ్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని బైక్ ఎక్కుంచుకుని వెళ్లే క్రమంలో ఎదురుగా కొందరు ఉంటారు. ఆ టైంలో ‘ అరేయ్ జరగండి రా నీ యబ్బా’ అని మాట్లాడాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసి.. పబ్లిక్‌లో ఇవే మాటలు బ్రో అంటున్నారు.

అయితే కొందరు మాత్రం ‘మా తెలంగాణ వాళ్లకి అది నార్మాలే బ్రో’ అని అంటుండగా.. ఇంకొందరు మాత్రం మండి పడుతున్నారు. మిగతా హీరోస్ ఎందుకు ఆ పదాలు వాడటం లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదే క్రమంలో హీరో నితిన్ పేరును ప్రస్తావించారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *