తైవాన్‌కు భూకంప ప్రమాదం ఎక్కువ అని నిపుణులు తెలిపారు. హువాలియన్-హువాడాంగ్ రిఫ్ట్‌వ్యాలీ మధ్య భూకంపాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇందుక్కారణం.. యురేషిన్ ఫలకం, ఫిలిప్పైన్స్ ఫలకంలో కదలికలని పేర్కొన్నారు. ఫిలిప్పైన్స్ ఫలకం వాయవ్యం వైపు ఏడాదికి 8 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ.. యురేషియన్ ప్లేట్‌లో కలుస్తుందని వివరించారు. ఈ కారణాల వల్లే తైవాన్ వ్యాప్తంగా స్కూలు విద్యార్థులకు భూకంపాలపై అవగాహన ఉంటుంది.
స్కూళ్లలో పసుపు రంగు హెల్మెట్లు అందుబాటులో ఉంటాయి. బుధవారం ఉదయం కూడా భూమి కంపించగానే.. తైవాన్ వ్యాప్తంగా స్కూళ్లలో ఉన్న విద్యార్థులు.. పసుపురంగు హెల్మెట్లు ధరించి, బయటకు పరుగులు తీశారు. అయితే తైవాన్ రాజధాని తైపీలో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4తీవ్రతగా నమోదైంది. భూకంపం ధాటికి తైపీలోని అనేక భవనాలు నేలమట్టమయ్యాయి.

తూర్పు తైవాన్‌లోని హువాలియన్ నగరానికి 18కిలోమీటర్ల దూరంలో 34.8కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) తెలిపింది. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. అయితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రైలు సేవలను నిలిపివేశారు. అంతేగాక పాఠశాలలు మూసివేశారు. భూకంపం కారణంగా కొండచరియలు సైతం విరిగిపడ్డట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవర్ ప్లాంట్లు సైతం దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది.