ఛార్మీ ఇంట్లో విషాదం. ఆకస్మాత్తుగా మరణించారని తెలిసి షాకైన ఛార్మీ.

కొంతమంది హీరోయిన్లు నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలనాటి మహానటి సావిత్రి ఈ కోవకు చెందిన మనిషే. ఆ తర్వాత సిల్క్ స్మిత కూడా ఇలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపుతున్న సమయం లో సినిమాలను నిర్మించి అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఛార్మీ..నిర్మాతగా రాణిస్తుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏తో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆమె డబుల్ ఇస్మార్ట్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉంది.

ఈ చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఛార్మీ ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఆమె తన బంధువును కోల్పోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలాగే తన అంకుల్‏తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తన అంకుల్ మరణంతో తన గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురైంది. “కక్కి అంకుల్ ఎంతో స్ట్రాంగ్‏గా” ఉంటారు.

అలాంటి వారు ఇలా ఆకస్మాత్తుగా మరణించారని తెలిసి షాకయ్యాను. నా గుండె బద్ధలైనట్లుగా అనిపిస్తుంది. అసలు జీవితం అనుహ్యమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. పింకీ పిన్నీ, స్వీడేల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను” అంటూ ఎమోషనల్ అయ్యింది ఛార్మీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *