బన్నీ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. భర్త అల్లు అర్జున్, పిల్లలు అయాన్, అర్హ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే స్నేహా రెడ్డి ‘పికాబూ’ అనే ఫోటో స్టూడియో వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్నేహ రెడ్డికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఇక శ్రీవారి విఐపి విరామ సమయంలో ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి.
ప్రముఖ నటి ప్రగతిలు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు.