చాలా మందిలో గ్యాస్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అతిగా వేయించి, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్లే వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంత మంది ఆహారాలు సరైన సమయాల్లో తీసుకోవడం లేదు అయితే ఇలాంటి సమయాల్లో కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గ్యాస్ట్రిటిస్ సమస్యల కోసం ఇంటి చిట్కాలు:-
పొట్టలో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో నిమ్మరసం వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా అల్పాహారాల్లో సలాడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కూడా నిమ్మరం కలిపి తీసుకోవడం వల్ల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోంపు నీరు కూడా పొట్టలో గ్యాస్ సమస్యకు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రంత సోంపును నీటిలో నానబెట్టి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
అల్లం, పుదీనా టీ తాగడం వల్ల కూడా గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి చిటికెలో ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిణులు తెలుపుతున్నారు. తీవ్ర గ్యాస్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు మజ్జిగను తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జంక్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరింత తీవ్ర తరంగా మరే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.