మా అమ్మ అలాంటిది, షాకింగ్ విషయాలు బయటపెట్టిన నాగచైతన్య.

హీరో నాగ చైతన్య సినిమాల విషయంలోనే కాకుండా.. బయట కూడా ఎంతో డిసిప్లెన్ , టైం సెన్స్ తో ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య పాల్గొనగా.. మీకు డిసిప్లెన్, టైం సెన్స్ ఎవరు నేర్పించారు అనగా.. అందులో చైతూ మాట్లాడుతూ… ఇది నేర్చుకుంది మేం తాతగారి నుంచి నేర్చుకున్నాం. క్రమశిక్షణ, టైం సెన్స్ అనేది రామానాయుడు గారు, ఏఎన్నార్ గారు ఇద్దరు టైం సెన్స్ నేర్పించారు. ఒక మనిషి పలానా టైం చెప్పారంటే.. ఆ సమయానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్లు కూడా ఎన్నో పనులు వదులుకుని వస్తుంటారు.

అలాంటప్పుడు వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంటూ చెప్పుకువచ్చాడు. డౌన్ టు ఎర్త్ అనేది అమ్మ లేదా నాన్న ఎవరు నేర్పించారు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చైతూ. అందులో నాగచైతన్య మాట్లాడుతూ… ఇక తన అమ్మ గురించి మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు అంతా అమ్మ దగ్గరే పెరిగాను. 18 సంవత్సరాలు అమ్మ దగ్గరే ఉన్నాను. అమ్మే నన్ను పెంచింది. అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎతిక్స్ ఫాలో అవుతారు. క్రమశిక్షణ, టైం సెన్స్, ఒక పర్సన్ కు రెస్పెక్ట్ ఇవన్నీ అమ్మే నేర్పించారు.

మీలో సెన్సిటివ్ నెస్, కొంచెం మీలో మీకు మాత్రమే సర్కిల్ గీసుకుంటూ ఉండిపోయేది అంతా అమ్మ నుంచే వచ్చాయా అని యాంకర్ అడగ్గా.. లేదు అని చైతూ చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ. బాగా కంఫార్ట్ ఉన్నవాళ్లతో ఓపెన్ అప్ అవుతాను. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వద్దు..ఒక 20, 30 మంది ఫ్రెండ్స్ వద్దు. రోజుకు ఇద్దరు ముగ్గురిని కలవడం నాకు ఇష్టం ఉండదు. నలుగురు, ఐదుగురు ఉంటే చాలు.. నిజాయితీగా ఉండే వాళ్లు చాలు. నేను తప్పు చేస్తే నాకు చెప్పాలి.

అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అది చాలు అంటూ చెప్పుకువచ్చారు. ఇక చైతూ మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చైతూ మనసు గొప్పదని.. అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సరసన సాయిపల్లవి నటిస్తుంది. చందు మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా.. అల్లు అరవింద్ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *