ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు.. మరెన్నో ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఆయా సంస్కృతులు మారుతుంటాయి. కానీ కొన్ని సాంప్రదాయాలు, ఆచారాల గురించి విన్నా, లేదా ఎక్కడయినా చూసినా వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి ఆచారంరా బాబూ అనిపిస్తుంది. గరాసియా తెగలు రాజస్థాన్, గుజరాత్‌లోని కొండల ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ తెగకు చెందిన చాలా మంది మహిళలు పెళ్లికి ముందే తల్లులు అవుతారు. అంతేకాదు తమకు నచ్చిన పురుషులను భర్తలుగా స్వీకరిస్తారు.
ఈ తెగలో పురుషులు, మహిళలు వివాహం లేకుండా కలిసి జీవిస్తారు. అంతేకాదు మహిళలు కూడా పెళ్లికి ముందే తల్లులు అవుతారు. తమకు నచ్చిన మగ భాగస్వామిని ఎంచుకునే హక్కు స్త్రీలకు ఉంటుంది. వివాహాల కోసం ఇక్కడ రెండు రోజుల పాటు ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లో యువతీ యువకులు గుమిగూడి, ఎవరినైనా ఇష్టపడితే, వారితో ఒంటరిగా జీవించడం, కాపురం చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు వారు వివాహం చేసుకోకుండానే ఒకరితో ఒకరు సంభోగం చేయవచ్చు.
ఆ తర్వాత ఊరికి తిరిగి రాగానే తల్లిదండ్రులు ఘనంగా పెళ్లి చేశారు. యితే, వారు కోరుకుంటే అవివాహితులుగా ఉండవచ్చు. ఈ తెగలో ఇలాంటి లివ్-ఇన్ ఆచారం చాలా ఏళ్లుగా ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ తెగకు చెందిన నలుగురు సోదరులు వేరే చోట నివసించేందుకు వెళ్లారట. వారిలో ముగ్గురు భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారట, అయితే ఒక సోదరుడు పెళ్లి చేసుకోకుండానే ఒక అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించాడట.