సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక ఇచ్చింది. ఇందులో గాంధీ ఆస్పత్రి వైద్యులు కీలక వివరాలను పేర్కొన్నారు. ఆమె మృతికి గల కారణాలను వివరించారు. లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే మరణించారని వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత తలకు బలమైన గాయాలు అయ్యాయని గాంధీ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
బలమైన గాయాలు కాడంతోనే స్పాట్‌లోనే చనిపోయినట్లు వెల్లడించారు.
శరీరంలోనిఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. పక్కటెముకలు, తొడ ఎముకలతో పాటు ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ఇవాళ తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
37 ఏళ్ల లాస్య నందిత కారులో కూర్చొని ఉండగా.. ఆమె ఫ్రెండ్, పీఏ అయిన ఆకాష్ కారు డ్రైవ్ చేశారు. ఐతే.. పటాచ్‌చెరు దగ్గర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు రైలింగ్‌ని ఢీకొట్టడంతో లాస్య నందిత స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.