ప్రతిసారి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి షికార్లు కొట్టే అనసూయ.. ప్రతి పండగ రోజును ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆయా పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అనసూయ స్మాల్ స్క్రీన్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తన అభిమానులు ఆమె ప్రజెన్స్ ను ఎంతగానో మిస్ అయ్యారు.
ఈ క్రమంలో అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. సినిమా అప్డేట్లను అందిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. ఎప్పుడూ నెట్టింట ఈ యాంకర్ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుసగా ఫ్యామిలీ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. గ్లామర్ ఫొటోలతో నెట్టింట మంటలు పుట్టిస్తూనే మరోవైపు సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా అనసూయ రీసెంట్ గా ఎక్కువగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు. ఆ మధ్యలో శ్రీకాళ హస్తిశ్వరీలో కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజ నిర్వహించింది.