కిర్రాక్ ఆర్పి ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్, యాంకర్ల గురించి మాట్లాడుతూ తన స్టైల్లో స్పందించాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్పి.. రష్మీ, అనసూయ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 2013లో జబర్దస్త్ ఓ ఎక్స్పరిమెంట్ షో గా ప్రారంభమైంది. రోజా, నాగబాబు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మునుపన్నడు లేని విధంగా అనసూయ యాంకరింగ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్స్ జడ్జెస్ గురించి తమ అభిప్రాయాన్ని వివరించాలని ఇంటర్వ్యూ అడగగా.. రష్మీ గురించి మాట్లాడుతూ అప్పటి వరకు ఉన్న యాంకర్ స్థాయిని మించిన యాంకర్ రష్మీ. ఆమె తెలుగు రాకపోయినా కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆమె తెలుగుని తెగులు అన్న కూడా అందరు నవ్వుకుంటారు.. ఆ రేంజ్ లో తన స్లాంగ్‌తో ప్రేక్షకులను అలరించింది అంటూ వివరించాడు.
అనూష గురించి మాట్లాడుతూ ఆమె యాంకర్ గానే కాదు నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమెకు యాంకరింగ్ తో పాటు సినిమాలు బాగా సెట్ అయ్యాయి అంటూ వివరించాడు. ఇలా జబర్దస్త్‌లో కమెడియన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక టాగ్ ఇచ్చాడు. సుదీర్ మల్టీ టాలెంటెడ్, గెటప్ శీను కమల్ హాసన్, రాంప్రసాద్ ఆటో డైలాగ్స్ కి ఫేమస్ అంటూ ప్రతి ఒక్కరి ప్రత్యేకతలను కిరాక్ ఆర్పి చెప్పుకొచ్చాడు.