శ్రీ లీల..ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పొచ్చు. స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇచ్చే డాన్స్ ని కలిగి ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అని విషయాలపై అనేకమంది అరా తీయడం మొదలుపెట్టారు. శ్రీ లీల..మొదట్లో ఈమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈమె డాన్స్ కి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఏమి నటించిన పెళ్లి సందడి మూవీ లో ఈమె డాన్స్ పెద్దగా కనిపించకపోయినా అనంతరం రవితేజ తో నటించిన ధమాకా మూవీలో ఈమె డాన్స్ కి ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు.
ఇక అలా ఇండస్ట్రీకి అడుగుపెట్టి అలా ధమాకాతో సూపర్ హిట్ విజయం అందుకుని టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిందనే చెప్పొచ్చు. 2023 మొత్తం శ్రీ లీల సినిమాలే ఉన్నాయి అంటే ఈమె ఎంత పాపులర్ అయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. నిజానికి శ్రీ లీల ఒక క్లాసికల్ డాన్సర్. అందుబల్ల ఆమె ప్రతి సినిమాలో డాన్స్ ని కూడా అవలీలగా చేసేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీ లీలా సమయం దొరికినప్పుడల్లా క్లాసికల్ డాన్స్ ని వేస్తూ సంతృప్తి చెందుతుంది. ఇక తాజాగా సమాతా కుంభ్ హైదరాబాదులో జరిగింది. ఈ క్రమంలో శ్రీ లీల స్టేజ్ పర్ఫామెన్స్ చేసింది. దాదాపు పది నిమిషాల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.