రోడ్డు పక్కన అమ్ముతున్న మొక్కజొన్న కంకిని మంత్రి రోజా కొనుగోలు చేసి తిన్నారు. సరదాగా మొక్కజొన్న విక్రయిస్తున్న వడమాల పేటకు చెందిన ఒక మహిళతో కాసేపు మాట్లాడారు. మొక్కజొన్న పొత్తులు అమ్మితే రోజుకు ఎంత ఆదాయం వస్తుందని ఆ మహిళను ప్రశ్నించారు. అయితే మంత్రి అయ్యాక ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరమైన రోజా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శాఖ కావటంతో.. ఏపీలో పలు జిల్లాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తన మంత్రి పదవికి న్యాయం చేస్తున్నారు.ఇదే సమయంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వటంలో కూడా ముందుండే రోజా తాజాగా ఉయ్యాలలో విహరించారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఓ ఊరిలో … ఉయ్యాలలో “సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా” తరహాలో … వీహరించడం జరిగింది.