అల్లు అర్జున్ కి తీవ్ర అనారోగ్యం, అభిమానుల్లొ ఆందోళన.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. వరుస విజయాలతో దూసుకు పోతున్న బన్నీ చాలా కాలం వరకు పాన్ ఇండియా మూవీస్ వైపు దృష్టి పెట్టలేదు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ తో ఘనవిజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ అల్లు అర్జున్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. అయితే బన్నీ ఈసినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు.

అంతే కాదు టీమ్ అంతా ఈమూవీని ఓ యుద్దంలా చేస్తున్నారు. ఈక్రమంలో ఈమూవీ షూటింగ్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈమూవీకి సబంధించిన కీలక సన్నివేశాలు షూటింగ్ కంప్లీట్ అయ్యిందట. ఇక ఓ సాంగ్ ను షూట్ చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ కాస్త సిక్ అయినట్టు తెలుస్తోంది. ఓ ఐటమ్‌ సాంగ్‌ని ఈ వారంలోనే చిత్రీకరించడానికి దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశారు. అయితే ఆ పాట షూటింగ్‌ పోస్ట్‌పోన్‌ అయింది.

అల్లు అర్జున్‌ అనుకోకుండా అనారోగ్యం పాలవ్వడమే ఈ పోస్ట్‌పోన్‌కి కారణమని తెలుస్తున్నది. నిజానికి ఈ సినిమాకోసం రెస్ట్ లెస్ గా కష్టపడుతున్నాడు బన్నీ. ఈ వారంలో జరిగే పాట చిత్రీకరణ విషయంలోనూ ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యారట. రిహార్సల్స్‌లో కూడా పాల్గొన్నారట. అయితే ఉన్నట్టుండి ఆయన సిక్‌ అవ్వడంతో షూటింగ్‌ని ఈ నెల రెండోవారానికి మేకర్స్‌ పోస్ట్‌ పోన్‌ చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *