పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి : హీరో నితిన్

హీరో నితిన్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రం నుంచి “ఓలే ఓలే పాపాయి” పాట ప్రోమో నేడు వచ్చింది. ఈ సాంగ్ ప్రోమో లాంచ్ ఈవెంట్‍కు హీరో నితిన్ హాజరయ్యారు. మీడియాతో మాట్లాడారు. హీరో నితిన్ మాట్లాడుతూ.. తాను హీరోను అయినా కాకపోయినా పవన్ కళ్యాణ్ అభిమానిని అని కొంత మందిలా ఒక స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత పేరు ప్రస్తావించకుండా వదిలేయడం లాంటివి చేయను.

నేను సాధారణ కుర్రాడిలా ఉంటాను. ఒకసారి ఫ్యాన్ అంటే ఇక లైఫ్ లాంగ్ ఫ్యాన్ అని అర్థం. ఇప్పుడు అభిమానిని అని చెప్పుకుని.. రేపు ఒక రేంజ్ వచ్చాక నేను ఫ్యాన్ కాదు, నాకు నేనే అభిమానిని అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు.. అని నితిన్ అన్నాడు. ఇప్పటికే చాలా సార్లు నితిన్.. పవన్ కళ్యాణ్ అభిమాని అనే ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఈసారి నితిన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇండైరెక్టుగా బన్నీ ఫ్యాన్స్ కు మంట పెట్టేసింది.

పవన్ అభిమానులు నితిన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్‌ను బన్నీ ఫ్యాన్స్ కు ట్యాగ్‌ చేస్తున్నారు. బన్నీ కెరీర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్‌ను ఒక రేంజ్ లో పొగిడి.. ఒక లెవిల్ వచ్చాక పవన్ గురించి మాట్లాడమని అంటే చెప్పను బ్రదర్.. అనటం కరెక్ట్ కాదని.. నితిన్ ని చూసి బన్నీ నేర్చుకోవాలని అతడి కామెంట్స్ ను వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక దీంతో బన్నీ అభిమానులు రివర్స్ ఎటాక్ మొదలు పెట్టారు. తన ప్రసంగాలలో పవన్ చెప్పిన కొన్ని కామెంట్లను ఇప్పుడు తెర మీదకు తెస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *