రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. కానీ, ఆయన పర్సనల్ లైఫ్ పెద్దగా ఎవరికీ తెలియదు. రేవంత్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే లవ్ స్టోరీ నడిపారు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అందుకు మినహాయింపు కాదు. రాజకీయాల్లో ఇంత దూకుడుగా ఉండే ఆయన.. ఇంట్లో ఎలా ఉంటారు.. కుటుంబంతో ఆయన అనుబంధం గురించి, ఆయన వ్యక్తిత్వం, కష్టపడేతత్వం.. వీటన్నిటి గురించి రేవంత్ సతీమణి గీత పలు సందర్భాల్లో మీడియాకు తెలిపారు.
రేవంత్ తొలుత విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు. పెళ్లికి ముందు కొన్నాళ్లు ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారం చేశారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలో ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం పెళ్లయిన తర్వాతే. పెళ్లికి ముందు.. రాజకీయాల్లోకి వెళ్లొద్దని రేవంత్‌కు చెప్పాన్నేను. ‘చూద్దాంలే’ అన్నారాయన. ఆ మాటంటే రాజకీయాల్లోకి వెళ్లరేమో అనుకున్నాను. పెళ్లయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తానన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తుచేస్తే.. ‘నేను వెళ్లననలేదు. చూద్దాంలే అన్నాను’ అని గుర్తుచేశారు. నాకు అప్పట్లోనే ఆయన మాటకారితనం అర్థమైంది. మాది ప్రేమ పెళ్లి.

ఇంటర్మీడియట్ నుంచి మా ప్రేమ కథ మొదలైంది. మొట్టమొదటిసారి మేం నాగార్జునసాగర్‌లో.. నాగార్జున కొండకు వెళ్లే బోట్‌లో కలిశాం. తను మా కజిన్‌కి ఫ్రెండ్. అలా పరిచయం. వాళ్లింటికి వస్తూ పోతూ ఉండగా పరిచయం పెరిగింది. తర్వాత్తర్వాత కలిసి మాట్లాడిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం, ఇండివిడ్యువాలిటీ బాగా నచ్చాయి నాకు. చాలా ముక్కుసూటి మనిషి. ‘అవును.. కాదు.. నా అభిప్రాయం ఇది. నా లక్ష్యం ఇది.. నేనిది చేయాలనుకుంటున్నాను’ అని స్పష్టంగా చెబుతారు. అది నాకు బాగా నచ్చేది.
కాలక్రమంలో మా పరిచయం ప్రేమగా మారింది. రేవంతే ప్రపోజ్ చేశారు. అయితే మొదట్లో ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే.. అప్పటికి రేవంత్ ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు. ఆర్థికస్థితిలో తేడాలున్నాయి. అయితే డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడంతో మా పెళ్లయింది. మా అమ్మకి రేవంత్ అంటే చాలా ఇష్టం. వాళ్లిద్దరి ఆలోచనావిధానం ఒకే తరహాలో ఉంటుంది.