ఎన్నో ఏళ్లుగా వరుణ్-లావణ్య ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి ఇటీవలే అభిమానులతో పంచుకున్నారు. వరుణ్-లావణ్య కలిసి ‘మిస్టర్’ సినిమాలో జంటగా నటించారు. 2017లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఇక తర్వాత అది ప్రేమగా మారింది. అయితే ఈ షూటింగ్ కూడా ఇటలీలోనే జరగడం మరో విశేషం. ఇక వీరి ప్రేమకి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపి ఆశీర్వదించారు. దీంతో ప్రేమ పక్షులు రెండు పెళ్లి బంధంతో ఒకటయ్యాయి.
అయితే వేణుస్వామి మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జాతకాల్లో దోషాలు ఉన్నాయి. వారి జాతకాల్లో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసుండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాఠికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కు నాగ దోషం ఉంది. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది’ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమవగా.. మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి ఇంటర్వ్యూలో రెండు విధాలుగా మాట్లాడారని, మొదట లావణ్యకు కుజ దోషం ఉందని చెప్పి.. ఆ తర్వాత లావణ జాతకంలో కుజ దోషంతో పాటు నాగ దోషం కూడా ఉందన్నారు.

కాబట్టి ఆయన మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయనే బలంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలోనూ తాను చెప్పింది నిజం అవుతుందనే భ్రమలో ఉన్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. కేసీఆర్ సీఎం విషయంలో దారుణంగా విఫలమైన వేణుస్వామి ఒత్తిడిలో ఉన్నాడని, తన పని అయిపోయిందనే విషయం తెలిసి పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నాడంటున్నారు. అంతేకాదు మరికొందరు మాత్రం ‘వాడు ఎక్కడున్నాడో దొరకపట్టుండ్రి’, ‘ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు’ అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు.