“వైఎస్సార్‌కీ, జగన్‌కీ ఆకాశం, భూమికీ ఉన్నంత తేడా ఉంది. వైఎస్సార్ హయాంలో రైతు రారాజు. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు జగన్ ఆన్న హయాంలో వ్యవసాయం అంటే దండగ. పంట వేసుకోవడం దండగ అన్నట్లు తయారయ్యింది. ప్రభుత్వం ఉచితంగా చదివించేలా వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెట్టారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పత్తా లేదు” అని షర్మిల ఫైర్ అయ్యారు.
అయితే తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ ఆటాడుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో షర్మిల పాల్గొని జెండావిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున చేపట్టిన పాదయాత్రపై స్పందించారు.
తనను పాదయాత్ర చేయమంటేనే చేశానని, నాకు నేనుగా పాదయాత్ర చేయలేదని చెప్పారు. భారతి పాదయాత్ర చేస్తానంటే అడ్డుకుని నేను పాదయాత్ర చేశానని చెప్పడం అవాస్తవమని తెలిపారు. కావాల్సిసిన వాళ్లు ఇలా మాట్లాడుతుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.