చెల్లెలితో సహా పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్.

అప్పట్లో పబ్ కెళ్లి బజ్జీలు తినేసి వచ్చామంటూ కుషిత పలు మీడియా సంస్థలకు వెళ్లడించింది. అప్పటి నుండి ఆమెను బజ్జీ పాప అంటూ ట్రోల్ చేశారు. కాగా, కుషిత పలు సినిమాల్లో నటించింది. అయితే రెండేళ్ల క్రితం హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో ఉన్న పబ్ లో డ్రగ్స్ వాడుతున్నారని తెలియడంతో పోలీసులు సోదాలు చేయగా పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఆ సమయంలో నిహారిక కొణిదెలతో పాటు పలువురు టాలీవుడ్, VIP పిల్లలు కూడా అదే పబ్ లో ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది.

ఆ కేసులో పలువురి పేర్లని చేర్చి విచారిస్తూనే ఉన్నారు. తాజాగా రాడిసన్ డ్రగ్స్ కేసులో మరికొంతమంది పేర్లను కూడా FIR లో చేర్చారని పోలీసులు తెలిపారు. ఆ ఘటన జరిగిన సమయంలో కుషిత కళ్లపు అనే నటి మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె.. మేము చీజ్ బజ్జిలు తినడానికి వెళ్ళాము, డ్రగ్స్ తో మాకు సంబంధం లేదు అని మాట్లాడటంతో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం కుషిత హీరోయిన్ గా టాలీవుడ్ చిన్న సినిమాల్లో నటిస్తుంది.

ఇప్పుడు ఈ రాడిసన్ డ్రగ్స్ కేసులో కుషిత సోదరి, యూట్యూబర్ లిషి గణేష్‌ పేరును పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆ డ్రగ్స్‌ పార్టీకి లిషి గణేష్‌ కూడా వెళ్లినట్లు గుర్తించారు. లిషి గణేష్‌తోపాటు FIR లో మరో వీఐపీ శ్వేతా అనే అమ్మాయి పేరు కూడా చేర్చారు. లిషి గణేష్‌ను పిలిచి విచారిస్తామని తెలిపారు పోలీసులు. అలాగే ఈ కేసులో నిందితులుగా అరెస్ట్ అయిన కేదర్నాథ్, నిర్భయ్ లు సొంత పూచికత్తుపై బెయిల్ మీద నిన్న విడుదలయ్యారు. మరో నిందితుడు వివేకానందకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *