రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా నిలవగా.. బీటెక్ బాబుగా అలరించిన అమర్ దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ మొదట్లో టిక్ టాక్‌లో వీడియోలు చేసుకుంటూ ఉండేవాడు. విచిత్రమైన ప్రవర్తనతో, పిచ్చోడిలా, వివిధ రకాలుగా వీడియోలు చేసేవాడు. కంటెంట్ కోసం ఎలాంటి వీడియో అయిన చేసేవాడు. అయితే కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ముందే న్యూస్ లీకైంది. దీంతో ప్రశాంత్ కోసం భారీగా అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చారు. ఇక అమర్ ఫ్యాన్స్ .. ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. ఈ గొడవలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
దీనికి ప్రశాంత్ కూడా పరోక్షంగా కారణం అంటూ పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ కోర్టు విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. ఎట్టకేలకు నాంపల్లి కోర్టు శుక్రవారం సాయంత్రం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. పోలీసుల మాట వినుంటే ప్రశాంత్ అరెస్ట్ అయ్యేవాడు కాదు. ఇంత రచ్చ జరిగేది కాదు. టైటిల్ విన్నర్ అరెస్ట్ తో బిగ్ బాస్ షో పరువు పోయింది. బిగ్ బాస్ సీజన్ 3 నుండి షో హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో వివాదంలోకి నాగార్జునని కూడా లాగారు. హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా కేసులు పెట్టాలి అంటూ డిమాండ్ వినిపించింది. హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ మానవ హక్కుల కమిషన్ కు కంప్లైంట్ చేశారు. బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈసారి ఆయన ఇమేజ్ మరింత డామేజ్ అయింది. దీంతో నెక్స్ట్ సీజన్ కి హోస్టింగ్ నాగార్జున చేయకపోవచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు నుంచి తప్పుకుంటే .. సీజన్ 8 కి ఎవరు హోస్టింగ్ చేస్తారు అనే చర్చ మొదలైంది.