రేవంత్ తమ మార్క్ చూపించాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు ఆల్రెడీ ఉన్న పథకాలు, కార్యక్రమాల్లో మార్పులు చేస్తుంటారు. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి రేషన్ కార్డులపై పడింది. ఆల్రెడీ ఉన్న కార్డుల్ని రద్దు చేసేసి, వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను డిసెంబర్ 28 నుంచి జారీ చెయ్యాలని అనుకుంటోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయనున్నారు. వీటి స్ధానంలో కొత్త కార్డుల జారీ కోసం అధికారులు లబ్దిదారుల ఎంపిక చేపడతారు.
గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారు. వీటిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతల్ని కూడా నిర్ణయించారు. వీటిలో పలు కీలక అర్హతలు ఉన్నాయి. రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాటు, సొంత కారు కలిగి ఉండరాదు. గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం, డాక్టర్, లాయర్ తోపాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ ఉండదు.

పన్నులు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. వీటితోపాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉండబోతోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలతో నకిలీ, ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడబోతోంది. ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంపుతో పాటు రేషన్ లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతోంది.