ఇండస్ట్రీలోని చీకటి నిజాలను బయటపెట్టిన స్టార్ హీరోయిన్‌. అవకాశాలు కావాలంటే..?

నేహా శర్మ మొదట తెలుగు సినిమా చిరుతలో రాం చరణ్ సరసన నటించింది ఇది 2007లో విడుదల అయింది. నేహా శర్మ కుర్రాడు సినిమాలో కూడా నటించారు. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులొ ఈ రెండు సినిమాల తరువాత అవకాశాలు రాకపోవడంతో హిందిలొ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు నేహా. ఈ ముప్పై ఆరేళ్ల నటి సౌత్ నుండి బాలీవుడ్ వరకు అనేక చిత్రాలలో పనిచేసింది. అయినా ఆమెకు దక్కాల్సిన పాపులారిటీ, స్టార్ డమ్ రాలేదు! దక్కలేదు. ఈ బోల్డ్, గ్లామరస్ నటి న్యూస్ 18 షోషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని చీకటి నిజాలను, సినిమాలను పొందడానికి తన కష్టాన్ని వెల్లడించింది.

అంతేకాదు హీరోయిన్‌గా ఎంపికైన తర్వాత తనను తొలగించడం చాలాసార్లు జరిగిందని తెలిపింది. ఈ నటి పేరు నేహా శర్మ.. నేహా శర్మ తెలుగులో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత తెలుగులో వరుసగా ఓ నాలుగు ఐదు చిత్రాల్లో నటించింది. అయితే ఆమె నటించిన ఏ సినిమా కూడా పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు.. హిట్ కాలేదు. దీంతో ప్రస్తుతం అవకాశాలు లేకుండా ఉంది. ఇక ఇంటర్వూలో నేహా శర్మ మాట్లాడుతూ.. ” మామూలుగా ఓ 5 చిత్రాలకు ఆడిషన్స్ జరుగుతోన్నాయి అనుకుంటే, మీరు ఆ ఐదు చిత్రాలకు ఆడిషన్ ఇవ్వవచ్చు, కానీ కొన్నిసార్లు మీకు అన్ని సినిమాలు రావు, ఒక్కటో రెండో వస్తాయి.

అందులో కథ బాగుంటే చేస్తాను.. లేదంటే లేదని తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. కొన్నిసార్లు నేను కొన్ని సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతాను, కొన్నిసార్లు నేను అందులో నటించడం ఇష్టం ఉండదు. అందువల్ల, ప్రతిదీ సరిగ్గా చేయడానికి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఈ భామకు ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చినా.. చివరి క్షణంలో తన స్థానంలోకి మరో హీరోయిన్ వచ్చిందని వెల్లడించింది. అంతేకాదు ఇది తనను షాక్ చేసిందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *