హీరోయిన్ సంయుక్త మీనన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కేరళ అబ్బాయిని హీరోయిన్ సంయుక్త మీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల పెద్దలు దీనిపై చర్చలు చేశారట. అంతేకాదు సంయుక్త మీనన్ ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే వీరి వివాహం జరగనుందని ఓ వార్త వైరల్ అవుతుంది.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారము డెవిల్ సినిమా తర్వాత సంయుక్త చేతిలో ఒక్క సినిమా కూడా చేయటం లేదని ప్రచారం జరుగుతుంది. ఎందుకు ప్రధాన కారణం పెళ్లి చేసుకోబోతున్న అంటూ ప్రచారం చేస్తున్నారు. సంయుక్త మీనన్ గత కొద్ది సంవత్సరాలుగా పేరెంట్స్ కి తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఇక ఆ సినిమాలో హీరోయిన్ అవ్వాలని తన కళ నెరవేరిన తర్వాత పేరెంట్స్ కు ప్రేమ విషయం చెప్పాలి అని ఇన్ని రోజులు ఆ విషయాన్ని దాచి పెట్టిందట.

ప్రస్తుతం సినిమాల్లో కూడా సక్సెస్ అయిన సంయుక్తమైన తన ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించిందట. అయితే అబ్బాయి వేరే మతానికి చెందిన అబ్బాయి అని సమాచారం. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండడం వల్లే ఏ సినిమాకు కూడా సంయుక్తమైన ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. మరి ఈ వార్త లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈమె పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.