సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ యొక్క కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. తమిళ సినీ రంగములో అగ్రశేణి నటులైన కమల్ హాసన్, సత్యరాజ్, విజయకాంత్ ల సరసన నటించింది. అయితే సినిమాల్లోకి రాకముందు పెప్సీ షోకి హోస్ట్‌గా వ్యవహరించింది సుకన్య.
కెరీర్ పీక్ లో ఉన్న నటి సుకన్య 2002లో పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె, అయితే భర్తతో అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ప్రస్తుతం వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో సుకన్య స్మాల్ స్క్రీన్‌పై పలు సీరియల్స్‌లో నటించడం ప్రారంభించింది.

సుకన్యకు భరతనాట్యం అంటే ఎనలేని ప్రేమ, తరచూ భరతనాట్య ప్రదర్శనలలో పాల్గొంటుంది. కూతురితో కలిసి ఉంటున్న ఆమె తన కూతురిని సినిమా సంబంధిత కార్యక్రమాలకు తీసుకురాలేదు. సుకన్య తన కుమార్తెను మీడియాకు దూరంగా ఉంచింది. ఈ నేపథ్యంలో నటి సుకన్య కూతురు ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇదిగో సుకన్య కూతురు అంటూ నెటిజన్లు ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు.