2014 మార్చి 12న తెలుగుదేశం పార్టీలో మల్లారెడ్డి.. అదే సంవత్సరం ఏప్రిల్ 9న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు సి.హెచ్ మల్లారెడ్డి. ఈయన 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు మల్లారెడ్డి. ఇక కేసీఆర్ రెండో మంత్రివర్గంలో 2019 ఫిబ్రవరి 19న, స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మల్లారెడ్డి. కాగా, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు 2023లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు చామకూర మల్లారెడ్డి.
సోమవారం జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపించారని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని అన్నారు.