మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహ చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్ ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
అయితే విచారణలో జగదీశ్ ప్రమేయం ఉందని తెలిసింది. నవంబర్ 27న సదరు మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసిన జగదీశ్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడని సమాచారం. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళను జగదీష్ బెదిరించాడు. ఆందోళన, మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది.

కొద్దిరోజులుగా పోలీసులు జగదీష్ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు పట్టుబట్టాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. పుష్ప మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు జగదీశ్. హీరో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. పుష్ప మూవీ జగదీష్ వాయిస్ ఓవర్ తోనే నడుస్తుంది. అంతటి కీలక రోల్ జగదీష్ కి దక్కింది. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో జగదీష్ మరింత పాపులర్ అయ్యాడు.