కేటీఆర్.. ఆ ఎన్నికల్లో గెలుపు నాకు ప్రతిష్టాత్మకంగా మారిందని..ఆ సమయంలో కేసీఆర్ కొడుకును అంటే నన్ను ఓడించడానికి జగన్ భారీగా డబ్బులు పంపించారని నా మనిషి ఒకరు తనతో చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయితే ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని కేటీఆర్ తెలపడం జరిగింది.
అయితే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. టీఆర్ఎస్‌తో కలవడాన్ని టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. జగన్‌కు తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం తప్ప, రాష్ట్రాభివృద్ధి పట్టదని.. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఇన్నాళ్లూ లోలోపల ఒకరినొకరు సపోర్టు చేసుకున్న టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీలు ఇప్పుడు ముసుగు తీసేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రదాని మోదీ డైరెక్షన్‌లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నడుస్తోందని, అందులో చేరి వైఎస్ జగన్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏర్పాటు చేయబోతున్న మహాకూటమిని నీరుగార్చే కుట్రలో భాగంగానే.. ఫెడరల్ ఫ్రంట్‌ను తెరమీదకు తీసుకొచ్చారని ఆరోపించారు.