బర్రెలక్క బ్యాంకు అకౌంట్ లో ఇప్పుడు ఎంత డబ్బు ఉందొ తెలుసా..?

సామాజిక మాధ్యమాలలో హడావిడే తప్ప, నేల మీద బర్రెలక్కకు బలమేమి ఉంటుందని పెదవి విరవవచ్చు. డిగ్రీ చేసి, ఉద్యోగం మీద ఆశ చచ్చి బర్రెల పెంపకం చేపట్టానని అరనిమిషం విడియో చేస్తే అది ‘వైరల్’ అయ్యింది. మనసు కదిలిన అన్ని సందర్భాలలో చేతలు కూడా కలిస్తే, వాస్తవ సమస్యలూ వాటి మీద కార్యాచరణ కూడా ‘వైరల్’ అవుతాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న సానుభూతి రాజకీయమద్దతుగా మారాలని బర్రెలక్క కోరుతోంది. అయితే కర్నె శిరీషది నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం..

తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కూడిన నిరుపేద కుటుంబం. తండ్రి వీరిని వదిలేసి వెళ్లాడు. దీంతో శిరీష తల్లి రోజు కూలీగా మారి కుటుంబాన్ని సాదుతోంది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే కుటుంబానికి ఆసరగా ఉండేందుకు శిరీష కూడా కూలీ పనులకు వెళ్లేది. తల్లిని అడిగి నాలుగు బర్రెలను కొని, వాటి పాలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఓ రోజు తనలాంటి నిరుద్యోగుల ఆవేదనను జనాలందరికీ తెలిసేలా ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇన్ స్టాలో సంచలనం సృష్టించింది. దేశవిదేశాల్లోని ఇన్ స్టా యూజర్లకు ఆమెను పరిచయం చేసింది.

కర్నె శిరీషను బర్రెలక్కగా మార్చేసింది. వీడియో వైరల్ కావడం కొందరికి కంటగింపుగా మారింది. ఫలితంగా శిరీషపై కక్ష సాధింపునకు దిగారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం శిరీషకు ఇన్ స్టాలో 5.73 లక్షల మంది, ఫేస్ బుక్ లో 1.07 లక్షల మంది ఫాలోవర్లు, యూట్యూబ్ లో 1.59 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *