గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అయితే బాత్‌రూమ్‌లో కేసీఆర్ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి.. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు 2 గంటలకు పైనే ఆపరేషన్ జరిగింది.
కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ సతీమణి శోభ సహా కుటుంబసభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయుకులు కూడా ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను జానారెడ్డి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థించారాయన.
మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీని యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా పోలీస్ మానిటరింగ్‌ను పెంచారు.