బిగ్‌బాస్‌ విన్నర్‌ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి..?

బిగ్ బాస్ షో తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రైతుబిడ్డ ఎక్కువగా కనిపించట్లేదు. ఏవో చిన్న చిన్న పార్టీలు, పలు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లు వంటి వాటికి మాత్రమే హాజరు అవుతున్నాడు. టైటిల్ ఫినాలే రోజు జరిగిన గొడవ, అతడు అరెస్ట్ అవడం ఆ తర్వాత జరిగిన రచ్చతో ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చాడు. ఆయన బర్రెలక్కను పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఇప్పటికే చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇలా అటు పల్లవి ప్రశాంత్‌, ఇటు బర్రెలక్క ఇద్దరూ సోషల్‌ మీడియాలో భారీ క్రీజ్‌ ఉన్న వాళ్లే. అయితే.. ఇప్పుడు వీళ్లిద్దరికీ సంబంధించి ఒక కామన్‌ విషయం వైరల్‌గా మారింది. అదేంటంటే.. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సోషల్‌ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. కానీ, దీనిపై ఎలాంటి అధికారక ప్రకటనలేదు.

ప్రశాంత్‌ కానీ, బర్రెలక్క కానీ దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా వాళ్లిద్దరూ ఎప్పుడూ ఒకే వేదికపై కలిసిన దాఖలాలు కూడా లేవు. అయినా కూడా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్‌ ఎలా వచ్చిందో మాత్రం అర్థం కావడం లేదు. చాల మంది ఈ విషయం నిజం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రైతుబిడ్డ, బర్రెలక్క పెళ్లి చేసుకుంటారనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *