అభయ హస్తం ఫామ్స్ ను చాలా మంది రూ. 20 నుంచి రూ.30 లకు అమ్ముతున్నారు. అయితే వీటిని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా గ్రామాలు, వార్డుల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి ఈ ఫామ్స్ ఉచితంగా అందిస్తారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా హామీ ఇచ్చిన పథకాలను అమలులోకి తెస్తోంది. ఇప్పటికే ప్రతిజిల్లాలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.
అయితే ఈ అభయ హస్తం ఫామ్ కోసం ప్రజలు మీ సేవ జీరాక్స్ కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వం ఈ ధరఖాస్తు ఫామ్‌లను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తారని, వీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేదని అధికారలు ప్రజలకు వివరిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోను వార్డులను ఏర్పాటు చేశామని, ఆ వార్డుల వద్దకు వెళ్లి ఉచితంగా ఫామ్‌ను తీసుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.

ఇక ఈ ఉచిత పథకాలకు ఉచితంగానే ఫామ్ నీ స్వీకరించాలి అని అధికారులు చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ ధరఖాస్తులను ఫోన్ లో కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వెసులుబాటును కల్పించింది. మీకు కూడా అభయ హస్తం దరఖాస్తు కాలనుకుంటే.. ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ ద్వారా (https://drive.google.com/file/d/1Wc9Eeo83xj3Cyp2LZjQrmKS4c1XI-WQq/view) అభయ హస్తం దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.