తాజాగా ప్రముఖ టీవీలో రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో రష్మీ తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. అయితే, ఈయన ఆ వ్యక్తి మన దేశానికి చెందిన వ్యక్తికాదు. ప్రతి అమ్మాయికి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలని ఇమాజినేషన్స్ ఉంటాయి. అయితే తాజాగా న్యూ ఇయర్ స్పెషల్ ఈ వెంట్ లో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది రష్మీ.న్యూ ఇయర్ సందర్భంగా ‘రష్మి పెళ్లి పార్టీ’ అనే పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్.
ఇందుకు సంబంధించిన ప్రోను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ ఎప్పటిలాగే ఎంతో హుషారుగా సాగింది. డ్యాన్స్ మాస్టర్ పండు ముగ్గురు ముద్దుగుమ్మలతో చేసిన హాట్ ఫర్ఫామెన్స్ హైలెట్. శ్రీసత్య, చమ్మక్ చంద్రల జోడీ మెస్మరైజింగ్ డ్యాన్స్ లతో అదరగొట్టారు. కామెడీ స్కిట్ల గురించి ఇక ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఓ ప్రశ్నను లేవనెత్తాడు.”ఇన్ని రోజులుగా నువ్వు టీఆర్పీ రేటింగ్స్ కోసం అన్నీ చేశావు.
కానీ ఇప్పుడు నిజం చెప్పు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? అతడిని మేము చూడాలనుకుంటున్నాము” అని అడిగాడు. కాగా.. ఆది ప్రశ్నకు రష్మి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది.’కాబోయే భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతీ అమ్మాయి అనుకుంటుంది. నాక్కూడా కాబోయేవాడు ఇలా ఉండలని కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి’ అని చెబుతుండగానే.. అంతలోనే వెనకనుంచి ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడే రష్మిని పెళ్లి చేసుకోబోయేవాడు అని ప్రోమోని బట్టి అర్దం అవుతుంది.