తమిళనాడులో సద్గురు నిర్వహించే మహాశివరాత్రి కార్యక్రమం ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వార్షిక కార్యక్రమాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం సంగీతం, నృత్యం, సాధనల విడదీయరాని సంగమాన్ని చూసేందుకు వీలు కల్పిస్తుంది.
అయితే మహా శివరాత్రి సందర్భంగా.. తమిళనాడులోని ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంతో మంది సెలబ్రిటీలు, భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఒక ఎత్తైతే.. ఈశా యోగా సెంటర్‌లో జరిగే వేడుకలు నెక్ట్స్ లెవల్.
శంభో శంకర అంటూ భక్తులు ముక్కంటిని వేడుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి శివ భక్తులు ఇక్కడికి వచ్చారు. మహా శివుడి పాటలతో తన్మయత్వంతో మునిగిపోతున్నారు భక్తులు.