నటి జయప్రద.. ఓ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ న్యాయంస్థానం ఆమెకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయితే సీనియర్ తెలుగు నటి జయప్రద గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు.
అంతేకాదు ఎంపీగా సేవలందించారు. అది అలా ఉంటే ఆమె మిస్సింగ్ అయ్యినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అయితే విచారణకు హాజరుకావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినా జయప్రద లెక్కచేయలేదట. ఈ నేపథ్యంలో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ క్రమంలో జనవరి 10న ఆమెను తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

ఈ క్రమంలో ఆమె కనిపించకపోవడంతో రాంపుర్ పోలీసులు ఆమెను వెతికే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇక జయప్రద సినిమాల విషయానికి వస్తే.. ఆమె తన అందచందాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు కొన్ని సంవత్సరాలు అలరించారు.. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా తన మార్క్ నటనతో ఆకట్టకున్నారు. ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా విజయాన్ని అందుకున్నారు.