ఆళ్ల రామృష్ణారెడ్డి తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామా సమర్పించానని ప్రకటించారు. సీఎం జగన్‌కు అత్యంత విధేయుడిగా పేరున్న ఆర్కే రాజీనామా నిర్ణయం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వైఎస్సార్‌సీపీకి తాను ఎంత సేవ చేశానో తనకు తెలుసని.. సర్వస్వం పోగొట్టుకున్నానన్నారు.
వైఎస్సార్‌సీపీకి సిద్దాంతాలు ఉండాలని.. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలన్నారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించానన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని.. కాంట్రాక్టర్లు తనపై ఒత్తిడి తెచ్చినా.. తాను సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగానన్నారు.
స్వయంగా తానే రూ.8కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానన్నారు. తన సొంత డబ్బుతో MTMC, దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేశామని.. లోకేష్‌ను ఓడించిన తనకు సహకారం అందించకపోతే ఎలా అని ప్రశ్నించారు.