కర్నాటక క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో యువ క్రికెటర్ హోయ్‍సల మృతి చెందాడు. అతడి వయసు 34ఏళ్లు. బెంగళూరులోని ఆర్ఎస్ ఐ గ్రౌండ్ లో ఏఈజీ సౌత్ జోన్ టోర్న్ మెంట్ లో (ఏజిస్) తమిళనాడుతో మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అయితే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేకమంది ప్రజలు గుండెపోటుకు గురవుతున్నారు.
అంత వరకూ బానే ఉన్న వాళ్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలి తమ ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి సంఘటనే ఇప్పడు బెంగుళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో కర్ణాటక మాజీ క్రికెటర్ కే.హోయసల గుండెపోటుతో కన్నుమూశాడు. 34 ఏళ్ల వయసులోనే అతడు కన్నూమూయడంతో ఆ ప్రాంగణంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

‘ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్’లో భాగంగా బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య జరగగా, కర్ణాటక టీమ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. గెలిచిన సంబరాల్లో ఆటగాళ్లు ఉండగా, అదే సమయంలో తీవ్రమైన ఛాతినోప్పినో హోయసల మైదానంలోనే కుప్పకూలాడు.