ఉప్పు గురించి మనకి తెలిసిందే. అలాంటి ఉప్పు మనకు చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు తీసివేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సోమవారం తిధి రోజు కానీ లేదంటే ఏదైనా తిధి రోజు కానీ, ఈ పరిహారాన్ని రాత్రి పూట రహస్యంగా చేసుకోవడం వల్ల మీ కష్టాలన్ని తొలగి మన జీవితాలు మారిపోతాయి.
ఒక గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్ నలుపు రంగులోకి మారుతుంది.అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి.
ఇలా చేస్తే.. మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది.