హీరోయిన్స్ ని మించిన అందంతో హీరో శ్రీకాంత్ కూతురిని చూశారా..!

శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో హీరో గానే కాకుండా విలన్ గా అలాగే చాలామంది స్టార్ హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు, కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఊహ పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంది. అలాగే వీరికి ఇద్దరు కొడుకులు,ఒక కూతురు కూడా ఉన్నారు. ఇప్పటికే పెద్ద కొడుకు రోషన్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

అయితే తాజాగా శ్రీకాంత్ కూతురు మేధా కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. గురువారం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. తల్లిదండ్రులతోపాటు కుమార్తె మేధ, చిన్న కుమారుడు రోహన్ సైతం తిరుమలకు వచ్చారు. శ్రీకాంత్ కుటుంబాన్ని చూసిన జనాలు వారితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించగా.. వారికీ సెల్ఫీలు ఇచ్చారు ఊహ, శ్రీకాంత్. అలాగే చాలా కాలం తర్వాత రోహన్, మేధను చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ముఖ్యంగా శ్రీకాంత్ కూతురు మేధపైన అందరి దృష్టి పడింది. చీరకట్టులో ఎంతో సంప్రదాయపద్దతిగా అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తూ సర్‏ప్రైజ్ చేసింది. పింక్ డిజైన్ చీరలో అందంగా మెరిసిపోయింది మేధ. తల్లితోపాటు నవ్వుతూ నడుస్తూ కనిపించింది మేధ. సింపుల్ అండ్ స్టన్నింగ్ లుక్‏లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది మేధ. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *