ఆసుపత్రి నుంచి భావోద్వేగంతో వీడియోను విడుదల చేసిన కేసీఆర్.

‘నన్ను చూసేందుకు ఆసుపత్రికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న వేలాది మంది అభిమానులకు ధన్యవాదాలు. అయితే వైద్యుల సూచనల మేరకు.. ఆసుపత్రికి రావొద్దు. ఎక్కువ మంది రావడం వల్ల.. ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని వల్ల సమస్య పెద్దదవుతుంది. నెలల తరబడి బయటకు పోలేనని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హిప్ జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ అనంతరం ప్రస్తుతం కోలుకుంటున్నారు. కేసీఆర్ ఈనెల 7 అర్ధరాత్రి బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో తుంటి ఎముకకు గాయమైంది. సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చేర్చగా.. వైద్యులు ఆయనకు హిప్‌ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు.

దీంతో కేసీఆర్ ను రాజకీయాలకు అతీతంగా నాయకులు ఆయన్ను పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలందరూ ఆయన్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే, మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యశోదా ఆసుపత్రికి భారీగా చేరుకున్నారు. ఈ తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి వీడియో రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *