బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధించిన ఒంగోలు కోర్టు. షాక్ లో అగ్రహీరోలు.

బండ్ల గణేశ్‌కు ఒంగోలుకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లకు గత కొన్నేళ్లుగా ఆర్థిక సంబంధమైన వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎంతకీ ఈ వివాదాలు సమసిపోవడం లేదు. ఇదే వ్యవహారమై 95 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందంటూ వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. గత కొద్దికాలంగా ఒంగోలు కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

అయితే నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర 2019లో బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి అసలు, వడ్డీతో కలిపి 1 కోటి 20 లక్షల రూపాయలకు గాను జెట్టి వెంకటేశ్వర్లుకు చెక్‌ ఇచ్చాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో ఈ చెక్‌ ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావడంతో 2019లో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. వెంకటేశ్వర్లు ఫిర్యాదును స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది.

నేడు తాజాగా బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఈ కేసుకు విచారణకు హాజరుకావాలని కోర్టు గణేష్‌కు పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు. దీంతో గతంలో కోర్టు బండ్ల గణేష్‌ మీద అరెస్టు వారెంటు కూడా జారీచేసింది. ఈక్రమంలో ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌ కూడా వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *