విజయవాడలోని గాంధీనగర్ బాబాయ్ హోటల్లో తెలుగు ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ ఆకస్మాతుగా ప్రత్యక్షమయ్యారు. సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలలో విక్టరీ వెంకటేష్, సైలేష్ కొలను దర్శకత్వంలో నటించిన సైందవ్ చిత్రం కూడా ఒకటి. అయితే కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు వెంకటేష్.
డైరెక్టర్, శ్రద్ధా కూడా దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత బెజవాడలో ఫేమస్ టిఫిన్ సెంటర్.. బాబాయ్ హోటల్లో సందడి చేశారు వెంకీ. అక్కడ కొంత మందితో ముచ్చటించి.. ఇక్కడ ఏం తినాలని అడిగారు. ఇక్కడ ఇడ్లీ బాగుంటుందని తెలిసి.. ఆర్డర్ చేశారు. కాసేపు అక్కడ టిఫిన్ చేస్తున్న అభిమానులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
అలాగే ఈ టీం విజయవాడ బస్సుల్లో కూడా సందడి చేసింది. అనంతరం గుంటూరులో పర్యటించారు. వీవీఐటీ కాలేజీకి వెళ్లారు. సాయంత్రం కేఎల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెకండ్ సింగిల్ లాంచ్ చేయనున్నారు మేకర్స్. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#SaindhavOnJAN13th @VenkyMama at Vijayawada pic.twitter.com/aspsXXrBMU
— devipriya (@sairaaj44) December 11, 2023