ఇన్నాళ్లు అక్కినేని ఇంటికి కోడలు లేదు అంటూ అవహేళనగా చేసి మాట్లాడిన వాళ్ల నోర్లు మూయించే నిర్ణయం తీసుకున్నాడు నాగార్జున అన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోనే బడా బిజినెస్ మాన్ అయినా టాప్ సెలబ్రిటీ మనవరాలని అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. అయితే ఈక్రమంలో ఈ హ్యాండ్ సమ్ హీరోని పెళ్లి చేసుకోవడానికి ఓ అమ్మాయి రెడీగా ఉందట. మరి అఖిల్ ని పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే…
అక్కినేని అఖిల్ త్వరలోనే బడా బిజినెస్ మ్యాన్ మనవరాలని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది టోటల్ గా ప్రేమ వివాహమే అంటున్నారు సినీ ప్రముఖులు. సొసైటీలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన స్టార్ బిజినెస్ మ్యాన్ మనవరాలిని అఖిల్ ప్రేమించాడట. అంతేకాదు అఖిల్ గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి అన్ని తెలిసిన ఆయన తన మనవరాలని అక్కినేని ఇంటికి కోడలుగా పంపించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

అంతేకాదు దివాళి ఫెస్టివల్ సందర్భంగా కాబోయే కొత్తకోడల్ని ఇంటికి కూడా ఆహ్వానించారట నాగార్జున అమల. ఇప్పుడు ఇదే న్యూస్ తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే వీళ్ళ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని ఆ తరువాత ఫైనల్ ముహూర్తాన్ని అభిమానులకు తెలియజేయబోతున్నారట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ స్టార్ బిజినెస్ మ్యాన్ మనవరాలే అఖిల్ కు ప్రపోజ్ చేసిందట. అఖిల్ గురించి తెలిసి అఖిల్ ఆల్రెడీ బ్రేకప్ అని తెలిసి కూడా ఆమె ఎలా ప్రేమించింది..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ప్రేమ ఎప్పుడూ ఎలా ఎవరికి పుడుతుందో చెప్పలేం అంటూ కొటేషన్స్ చెబుతున్నారు.