వయో భారంవలన గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం విషమించడంతో నవంబర్ 11న ఉదయం 9.45 గంటలకు మరణించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రమోహన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ నివాళులు తెలియజేశారు. అయితే పదహారేళ్ళ వయసు సినిమా ఆయనకు నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.
ఇక టాలీవుడ్ లో చంద్రమోహన్ దివంగత స్టార్స్ అయినా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారు. ఇండస్ట్రీలో చంద్ర మోహన్ లక్కీ హ్యాండ్ అని చెబుతుంటారు. ఈయనతో తొలిసారిగా నటించిన చాలామంది హీరోయిన్లు స్టార్ లుగా రాణించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె . విశ్వనాథ్ చంద్రమోహన్ కి కజిన్ అవుతారు. అందుకే ఎక్కువగా చంద్రమోహన్ విశ్వనాధ్ గారి సినిమాలలో నటించారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాపు గారు కూడా చంద్రమోహన్ కి బంధువులు అవుతారు. అందుకే ఆయన సినిమాలలో కూడా ఎక్కువగా నటించారు.
చంద్రమోహన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా సినిమాలు చేశారు. ఆయన నటనకు రెండు ఫిలిం ఫేర్ అవార్డులు, ఆరు మంది అవార్డులు వచ్చాయి. పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. అయితే ఆయన మరణానికి గల కారణం అనారోగ్య సమస్య అని తెలుస్తుంది. 82 ఏళ్ల వయసు కలిగిన చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఆయన వయసు కూడా పైబడడంతో అనారోగ్య సమస్యతో మరణించినట్లుగా తెలుస్తుంది.