వరుసగా సినిమాలు చేస్తున్న తమన్నా.. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఎటువంటి వివాదాలు లేకుండా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. అయితే ఆమధ్య మాత్రం తమన్నా ప్రేమలో పడి అందరికి షాక్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు, తెలుగు వ్యక్తి అయిన విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. ఓ పార్టీలో తమన్నా, విజయ్ కిస్సింగ్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే బాలీవుడ్ లో తమన్నా అండ్ విజయ్ వర్మ కపుల్ హాట్ టాపిక్ అయ్యిపోయారు.
ముందుగా వీరిద్దరి ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టడం, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాగా ట్రెండ్ అయ్యారు. ఇక వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 వంటి అడల్ట్ సినిమాలో నటించి రొమాన్స్ చేయడంతో మరింత వైరల్ అయ్యారు. ఈ రూమర్స్ పై ఇద్దరూ స్పందించి.. అవును మేము ప్రేమలో ఉన్నాం, డేటింగ్ చేస్తున్నాం అని క్లారిటీ ఇస్తూ వారి ప్రేమ గురించి బయట పెట్టారు. తమన్నా విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు.
అయితే గత రెండు రోజులుగా వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ అంతా కొంచెం లేట్ అయినా ప్రేమించి లేటెస్ట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. తమన్నా కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్లనుంది. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ చేతిలో ఉన్న సినిమాల్లో సెట్స్ మీద ఉన్నవి పూర్తి అవ్వగానే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.