గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో, నిద్రలేచిన చంద్రయాన్ 3, మళ్లీ పనిచేస్తోంది..!

చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. అయితే ‘చంద్రయాన్ 3’ ప్రయోగంలో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు గతేడాది ఆగస్ట్‌ 23 నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై పరిశోధనలు చేశాయి. ఆ తర్వాత జాబిల్లిపై చీకటి కావడంతో ల్యాండర్, రోవర్‌లను ఇస్రో స్లీప్‌మోడ్‌లోకి పంపించింది. దక్షిణ ధ్రువం వద్ద ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉన్న చంద్రయాన్‌ 3 ల్యాండర్ నుంచి తాజాగా సిగ్నల్స్ వచ్చాయని ఇస్రో వెల్లడించింది.

ప్రస్తుతం తాము ల్యాండర్‌లోని పరికరాల లొకేషన్లను గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్‌ 3 ల్యాండర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన లూనార్‌ రికనిసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) ఉంది. ఆ లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్‌లోని లేజర్‌ రెట్రో రెఫ్లెక్టర్‌ ఎరే (ఎల్‌ఆర్‌ఏ).. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్‌ మార్కర్‌ సేవలను పునరుద్ధరించిందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రయాన్‌ 3లో వివిధ సంస్థలకు చెందిన ఎల్‌ఆర్‌ఏలను అమర్చినా.. నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏ మాత్రం నిరంతరం పనితీరు కనబరుస్తూనే ఉందని ఇస్రో తెలిపింది.

దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్‌ఆర్‌ఏ పర్యవేక్షణ మొదలవుతుందని చెప్పింది. చంద్రయాన్‌ 3 నుంచి తూర్పు వైపునకు మళ్లీ ఉన్న ఎల్‌ఆర్‌ఓలోని లేజర్‌ అల్టిమీటర్‌ (లోలా) చంద్రయాన్‌ 3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. ఇందులోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణానికి అనువుగా ఏర్పాటు అయ్యాయి. దాదాపు 20 గ్రాముల బరువు ఉండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై పనిచేసేలా తయారు చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేవలందిస్తున్న ఎల్‌ఆర్‌ఏ ఇదొక్కటే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *