సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. బడుగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.
పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది. అయితే తాజాగా సాయి పల్లవి..అమలా పాల్ మాజీ ముగుడు ఏ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
తన పెళ్లి విషయమై సాయి పల్లవి ఏకంగా ఫైర్ అయింది. ఇపుడే పెళ్లి చేసుకోను అంటూ చెబుతూనే తాజాగా కొత్త పెళ్లికూతురు అవతారంలో దర్శనమిచ్చింది రౌడీ బేబి. అంతేకాదు పెళ్లి కూతురు అవతారంలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ భామ కొత్త పెళ్లి కూతురులా తయారైంది మాత్రం తన పెళ్లి కోసం కాదు.