లేత మునగాకుతో ఇలాచేస్తే మిమల్ని ఎవ్వరూ ఆపలేరు, ఎలా చేసి తినాలంటే..?

మునగాకులోని బీటాకెరొటిన్‌ పుష్కలంగా ఉంటుంది. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మునగాకును ఏ విధంగానైనా వండుకోవచ్చు. కూర, పప్పు, వేపుడు, పొడి… ఇలా ఏ విధంగా తిన్నా దీనిలోని ఐరన్‌ కంటెంట్‌ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అయితే మునగ ఆకులో ఉండని విటమిన్ ఉండదు. సాధారణంగా ఒక్కో కూరగాయ, పండులో ఒక్కో విటమిన్ ఉంటుంది. అన్ని విటమిన్స్ కావాలంటే ఖచ్చితంగా అన్ని పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

కానీ.. అవేవీ తీసుకోకుండా.. ఒక్క మునగాకును తీసుకుంటే చాలు అన్ని రకాల విటమిన్స్ మనకు అందుతాయి. మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్లకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. మునగాకును ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు. అంటే.. ఆకుల రూపంలో, పేస్ట్ రూపంలో, రసం రూపంలో, ఇంకా చెప్పాలంటే ఆకుని ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పౌడర్ ను కూడా మనం వినియోగించుకోవచ్చు.

మునగాకుతో టీ తయారు చేసుకొని తాగుతూ ఉంటే చాలా రోగాలు నయమైపోతాయి. మందులు కూడా అవసరం లేకుండా అంత చక్కగా మన ఆరోగ్యం మెరుగు అవుతుంది. పేగుల్లో నిలువ ఉండే కొవ్వులను కూడా తొలగించేస్తుంది మునగాకు. అలాగే.. స్థూలకాయంతో బాధపడేవాళ్లు కూడా మునగాకు టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మునగాకు టీ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్టరాల్ తగ్గి మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *