యువతి శిరీష..మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఆమె తెలిపారు.
అయితే బర్రెలక్క పేరుతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన శిరీష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు పెట్టారని, అందుకే నిరుద్యోగుల తరపున తాను బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు బర్రెలక్క. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కొల్లాపూర్‌నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
తాను నిరుద్యోగిగా నామినేషన్ వేశానని, మిగతా అభ్యర్థుల మాదిరిగా తాను ప్రచారం చేయలేకపోవచ్చు.. డబ్బు పంచకపోవచ్చు.. కానీ ఓటర్ల మనస్సు మాత్రం తప్పకుండా గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఏది మంచి, ఏది చెడు అనేది వయోజనులు ఆలోచించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.